మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా కవి కాళోజి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

కమిషనర్ కే.సంపత్ కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా కవి కాళోజి ఆలోచనలు సమాజంలో ప్రజాసేవ భావానను పెంపొందించి స్ఫూర్తిని నింపాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.