మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని మృత దేహాన్ని గుర్తించారు.
మృతదేహంపై ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపైన తెలుపు, నలుపు రంగు పొడుగు గీతల ఫుల్ షర్టు బూడిద రంగు కాటన్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. బోడ గుండుగా ఉన్నాడని, ఎడమ పిరుదు పై ఒక పుట్టుమచ్చ కలిగి, బక్కగా ఉన్నాడని, హిందూ మతస్తుడై ఉంటాడని రైల్వే ఎస్ఐ మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ కు కింద ఇవ్వబడిన 9701112343, 8328512176 సెల్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
