భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
కలుషిత త్రాగు నీటితో చిన్న పిల్లలకు ఒంటినిండా పొక్కులు మరియు దురదలు…
ప్రశ్నించాల్సిన ఆదివాసి సంఘాలు మచ్చుకైనా కనపడకపోవడం విశేషం…?
అయ్యా నాయకులు, అధికారులు మీరైతే ఈ నీరు త్రాగుతారా… అంటున్న బాధిత చింతకుంట గిరిజన ఆదివాసీలు…
కూత వేటు దూరంలోనే గలగలలాడే గోదావరి నది ఉన్న బుక్కెడైన మంచినీళ్లు దొరుకుతాయని ఆశతో ఎదురుచూస్తున్న గిరిజనులు…?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోత పట్టి నగర్ గ్రామ పంచాయతీలోని లోని గిరిజన ఆదివాసీ గ్రామమైన చింతకుంట గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీరేది ఎన్నడు…
రోజురోజుకు దిగజారుతున్న గిరిజన ఆదివాసీ బతుకుల పై సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు ప్రచురించిన ఫలితం శూన్యం అన్నట్టు ఉంది పరిస్తితి…
ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్న పినపాక నియోజకవర్గం లోని ఆదివాసి ఎస్టీలకు ఇలాంటి పరిస్థితి ఉందంటే ప్రశ్నించాల్సిన ఆదివాసి సంఘాలు మచ్చుకైనా కనపడకపోవడం విశేషం… ఆదివాసి హక్కులకై పోరాటం చేయలేని సంఘాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని రోధిస్తున్న ఈ చింతకుంట గ్రామం ఆదివాసీలు.
అయ్యా నాయకులు, అధికారులు మీరు మీ కుటుంబాలు ఈ నీరు తాగుతారా అంటూ ప్రశ్నిస్తున్న చింతకుంట గ్రామ గిరిజన ఆదివాసి బిడ్డలు…?
బడుగు బలహీనుల మంచి కోరే కమ్యూనిస్టులు సైతం ఈ చింతకుంట గ్రామానికి దూరంగా ఉన్నారంటే అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్న రాజకీయ విశ్లేషకులు.
సరైన రోడ్డు సదుపాయం, చిన్న పిల్లలకు స్కూలు, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టిక ఆహారం ఇవ్వడానికి అంగనవాడి, మా ఊరికి కరెంటు లేక నానా అవస్తలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.
ఎవరినీ పల్లెత్తు మాట అనని ఆ అమాయక ఆదివాసీలకు కనీసం త్రాగు నీరైనా అందించి వారి కుటుంబాలను కాపాడే కనీస బాధ్యత కూడా తీసుకోని ఈ రాజకీయ నాయకులను, అధికారులను ఏమని ప్రశ్నించాలి అంటున్న స్థానిక ప్రజలు.
సుద్ద నీరు వచ్చే నాలుగు బోరింగులని చూపించి తప్పించుకుంటున్న నాయకులను ప్రశ్నించాలా లేక కంటి తుడుపు చర్యగా మంచినీటి ట్యాంకును బాగుచేయించి మళ్ళీ అదే బోరింగు నీరు ఆ ట్యాంకు ఎక్కేలా చేసిన అధికారులను అడగాలా అని వాపోతున్న గిరిజనులు.
కూతవేటు దూరంలో గలగలలాడే గోదావరి నది ఉన్న ఆ గోదావరి నది నీళ్లు బుక్కెడైనా దొరుకుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు, ఈ ఆదివాసి గిరిజనుల త్రాగునీటి కష్టాలు ఆ గ్రామానికి మౌలిక వసతులు తీరుస్తారని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు పలు విధాల విన్నవించుకుంటున్న చింతకుంట గ్రామ గిరిజనులు…
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











