విప్ప లడ్డూ కావాలా నాయనా…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్.
అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి లడ్డూలు, ఔషధ గుణాలున్న వనమూలికలతో కారంపొడి, పచ్చళ్ళు తయారు చేసి విక్రయిస్తూ స్వశక్తితో చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పి జీవనోపాధి పొందుతున్న ఆదివాసి మహిళలను పీవో రాహుల్ అభినందించారు.
ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ కు బ్రాండింగ్, ప్యాకింగ్ కు కావాల్సిన మిషనరీని ఐటీడీఏ ద్వారా అందించి మరింత అభివృద్ధి అయ్యేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి….
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
