సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️ దుర్గా ప్రసాద్
ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు…
స్థానిక ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి వెంటనే రోడ్ల పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ సారపాక లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సారపాక ప్రధాన కూడలి నుంచి రెడ్డిపాలెం వెళ్లే దారిలో పెట్రోల్ బంకు వద్ద మరియు మసీదు రోడ్డు గ్యాస్ గుడౌన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ…, బూర్గంపాడు మండల పరిధిలోని మరీ ముఖ్యంగా సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్నీ బీటీ రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, తాత్కాలిక మరమ్మత్తులతో కంటి తుడుపు చర్యలు చేయడం కాదు శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేయకపోతే ప్రజలు త్వరలోనే మిమ్మల్ని గద్దె దింపటం ఖాయం అన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొత్త రోడ్లను నిర్మించాలని హెచ్చరించడం జరిగింది. లేనియెడల మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మండల నాయకులు బిఆర్టియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






