భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పినపాక ఏజెన్సీ
✍️దుర్గా ప్రసాద్
పినపాక ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలనీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ… సోమవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు లో పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ఏరియాలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ ,మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయనీ వీటిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో యజమానులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ ఒక పద్ధతి లేకుండా ఏ షాపు వారు ఆ షాపు అధిక ధరలు పెంచుకుంటూ సామాన్యుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు వస్త్రాలు కుట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీనిపై ఆధారపడి జీవిస్తున్న టైలర్లు కూడా వీటి ధాటికి ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ ప్రాంతం కనుక గిరిజన చట్టాల నేపథ్యంలో అనుమతులు లేనటువంటి టైలరింగ్ మగ్గం వర్క్ షాపులపై తగు చర్యలు తీసుకోగలరని బి. రాహుల్ కోరినట్లు బాబు తెలిపారు.
భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో పిఓ ప్రత్యేక కృషితో గిరిజన సాంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మొక్కను బహుకరించారు.
ఇవి కూడా చదవండి …
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
- బీఆర్ఎస్ లోని బీసీ నేత శీలం సమ్మయ్య గౌడ్ ఆవేదన…
- జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్
- గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా గారు
- గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్
- మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…
