మంచిర్యాల జిల్లా,
దేవాపూర్,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాధర వాణి(44) అనే మహిళ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే…
వాణి కి 20 ఏళ్ల క్రితం చొప్పరి భూమయ్య అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఒక సంతానం. భూమయ్య మద్యానికి బానిసైనందున, వాణి కుట్టు మిషన్ పని చేసుకుంటూ వొచ్చిన దాంట్లో సర్ది పెట్టుకుంటూ కాలం వెల్లదీసింది. పూట గడవని పరిస్థితి దాపురిస్తుండడంతో కుటుంబ భారం మోయలేక, చివరికి ఆత్మ హత్యే శరణమణి భావించి బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
ఇట్టి విషయమై మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు దేవాపూర్ ఎస్.హెచ్.ఓ, ఏ.గంగారాం ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
