భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూ గాంధీ-నెహ్రు కుటుంబానికి విధేయుడుగా ఉంటున్న మహోన్నతవ్యక్తి ఖర్గే అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

అఖిల భారత కాంగ్రెస్ (AICC) అధ్యక్షలు, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం పాల్వంచ అయ్యప్ప నగర్ లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బర్త్డే కేక్ ను కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తొమ్మిదిసార్లు కర్ణాటక శాసనసభ్యునిగా, కేంద్ర కార్మిక, రైల్వే మంత్రిగా, లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, అనేక పదవులను చేపట్టారన్నారు. ఖర్గే నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కరరావు, SVRK ఆచార్యులు, కాపర్తి వెంకటాచారి, Y వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, షేక్ చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, వాసుమల్ల సుందర్ రావు, ధర్మసోత్ ఉపేందర్ నాయక్, కాపా శ్రీనివాసరావు, జూనియర్ గద్దర్ SK బాషా, మస్నా శ్రీనివాసరావు, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, సమ్మిడి జనార్ధనరెడ్డి, జగన్నాధం అజిత్ తదితరులు పాల్గొన్నారు.