భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాల నిర్మించాలి

కొత్తగూడెం జిల్లాను ఉన్నత విద్య కేంద్రంగా అభివృద్ధి పరచాలి

ఆకునూరి సుప్రియ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు

పారిశ్రామిక కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంతో చరిత్ర ఉందని ఈ ప్రాంతం భారతదేశానికి విలువైన ప్రాంతంగా కీర్తించబడుతున్నదని
ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నప్పటికీ పరిశ్రమలలో పనిచేయడానికి గిరిజనేతరులు కూడా జీవనం కొనసాగిస్తున్నారని ఖనిజ, జల, సంపదలకు నిలయం అవటమే కాక పర్యటక కేంద్రంగా కూడా కీర్తించబడుతున్నదని ఉమ్మడి ఖమ్మం జిల్లా గా ఉన్నప్పుడు
సుమారు 60 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రామచంద్ర డిగ్రీ కళాశాల, ఐటిఐ, పాలిటెక్నిక్, మైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ప్రాంతంలో కొత్తగూడెం కేంద్రంగా రామవరం లో ఉండేది నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే తలమానిగం ఈ రామచంద్ర డిగ్రీ కాలేజ్ ఇతర జిల్లాల నుండి కూడా ఈ కాలేజీలో డిగ్రీలు పూర్తిచేసుకుని వెళ్లేవారు ముఖ్యంగా ఈ కాలేజీలో ఈనాటి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు నాటి రాజకీయ నేతలు జలగం ప్రసాదరావు సాంబానీ చంద్రశేఖర రావు లాంటివారు ఈ ప్రాంతంలోనే వారి విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలాంటి కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నత విద్య కేంద్రాలు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆకునూరి సుప్రియ ఖమ్మం పార్లమెంటు సభ్యులు
రామసహాయం రఘురామ్ రెడ్డి కి, ఈరోజు కొత్తగూడెంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది, దాని సారాంశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా గిరిజన మరియు అణగారిన వర్గాల జనాభా అధికంగా ఉన్నారని, ఈ వెనుకబడిన వర్గాల అభివృద్ధి అత్యంత ముఖ్యమని ఆకునూరి సుప్రియ ఆ లేఖలో తెలియ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, గిరిజన జిల్లాల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హ్యుమానిటీస్, సైన్సెస్, మేనేజ్‌మెంట్ మరియు కామర్స్ కోర్సులను అందించే ప్రభుత్వ పీజీ కళాశాల, 5 సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ మరియు 3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీతో లా కళాశాల, అలాగే బీపీఎడ్ కళాశాల స్థాపించాల్సిన అవసరం ఉందని ఆకునూరి సుప్రియ తెలియజేశారు.

ఇది అణగారిన వర్గాల, గిరిజన సమూహాల మరియు వెనుకబడిన వర్గాల సాధికారతకు ఎంతగానో దోహదపడుతుంది. న్యాయ విద్య ఈ వర్గాలకు భారత రాజ్యాంగం ప్రకారం వారి హక్కులు మరియు విశేషాలను తెలుసుకోవడానికి అవగాహన కల్పిస్తుంది మరియు న్యాయ నిపుణులను తయారు చేస్తుంది. మేనేజ్‌మెంట్ విద్య వ్యవస్థాపకులను అభివృద్ధి చేస్తుంది. శారీరక విద్య ఉపాధ్యాయులను తయారు చేస్తుంది, ఇది క్రీడా సంస్కృతిని పెంపొందిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు సాధారణంగా మంచి శారీరక దారుఢ్యంతో ఉంటారు మరియు క్రీడలు, అథ్లెటిక్స్‌కు అనుకూలంగా ఉంటారు.

పై కారణాలను దృష్టిలో ఉంచుకొని, కొత్తగూడెంలో ప్రభుత్వ పీజీ, లా మరియు బీపీఎడ్ కళాశాలల స్థాపన జరిపించాలని ఆకునూరి సుప్రియ విజ్ఞప్తి చేశారు.


వినతి పత్రం స్వీకరించిన పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి సానుకూలంగా స్పందించి కొత్తగూడెం జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.