మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:28 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూరు మండలంలోని బలాన్ పూర్ గ్రామంలో సుమారు 150 మంది జనాభా కలిగిన గిరిజన ఆదివాసులు ఉంటున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో 20 మంది పిల్లలు చదువు కొరకు పడరాని పాట్లు పడుతున్నారు.
సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేచీని గ్రామానికి కాలినడకన వెళ్లి చదువుకోగా మరి కొందరు దగ్గరి బంధువుల ఇంటి నుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది విద్యార్థులు గత్యంతరం లేక వివిధ గురుకుల పాఠశాలలో చేరి చదువుకుంటున్నారు.
మరి కొంతమంది ఏమి చేసేది లేక ఇంటి వద్దనే ఉంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో ఒక్క విద్యార్థి కోసం పాఠశాలను నిర్వహిస్తున్నారు.
అటువంటప్పుడు బలాన్ పూర్ లో అంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల లేకపోవడం చాలా బాధాకరం. పిల్లల కష్టాలు చూసి ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రాథమిక పాఠశాల తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
