రిలయన్స్ జియో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ చందాదారుల సంఖ్య 50 కోట్లు (500 మిలియన్లు) దాటినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

ఈ ఘనతతో టెలికాం రంగంలో జియో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇదే వేదికగా, జియో ఐపీఓ 2026 ప్రథమార్ధంలో రానుందని ఆయన మరోసారి స్పష్టం చేయడంతో పెట్టుబడిదారులలో ఆసక్తి నెలకొంది.