మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోమాస శ్రీకాంత్ ను హెచ్చరించిన నేతకాని సంక్షేమ సంఘం నాయకులు…

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మాల గురిజాల గ్రామానికి చెందిన గోమాస శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వెల్లడించారు.

గురువారం టేకులబస్తీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నాయకులు కలాలి నరసయ్య, గోమాస రాజం లు మాట్లాడుతూ…

చిన్నయ్య మీద గోమాస శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని దుర్గం చిన్నయ్యకు బేశారతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతని ఇంటి ముందు ధర్నా చేపడుతామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాలి నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం,నాయకులు గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, జాడి రమేష్, దుర్గం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి …