మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 22 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.

వందరోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక మహిళా గ్రూపులు 50వ రోజును విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ 50 రోజుల్లో తయారుచేసిన రకరకాల ఉత్పత్తులను మేళా ద్వారా తమ మేధస్సును చాటుకున్నారు. స్వయం సమృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం తలపెట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం మహిళల్లో ఉత్పత్తుల తయారు నైపుణ్యతను వేలికి తీసిందని పలువురు కొనియాడారు. ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు రకరకాల ఉత్పత్తులను స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఈ మేళాలో ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాకు విశేషమైన స్పందన కనిపించింది. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆహార ఉత్పత్తులు వస్త్రాలు ఇతర గృహోపకార వస్తువుల ఉత్పత్తులు తయారీలో మహిళా సంఘాల సభ్యులను కమిషనర్ రమేష్ అభినందించారు. మిగిలిన 50 రోజులను కూడా మహిళా సంఘాల సభ్యులు ఇదే స్ఫూర్తితో ఇంకా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులను తయారు చేసి వందరోజుల ప్రణాళికను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో టీ ఎంసీ దుర్గయ్య, స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్పీలు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.