మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్ళితే…
గత రెండు రోజుల క్రితం తల్లి రాజేశ్వరితో వాగ్వాదం జరగడంతో ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడ్డి మందు తాగాడని వారి బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. అనీల్ నా చావుకు కారణం తల్లి రాజేశ్వరి ఆవడం గ్రామానికి చెందిన తిరుపతి అనే ఇద్దరు వ్యక్తుల వల్లనే ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని, నా చావుకు వారే కారణమని చనిపోయే ముందు తీసిన వీడియో చర్చనీయాంశం అయిఈ విషయంపై బంధువులు స్పందించి గురువారం శవంతో ఆవడం గ్రామంలో తిరుపతి ఇంటి ముందు ఆందోళలనకు దిగారు. ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళనకారులు విరమించలేదు. చివరకు కొంతమంది పెద్ద మనుషులు బాధిత కుటుంబంతో మరియు తిరుపతి కుటుంబంతో చర్చలు జరిపి నష్టపరిహారం ఇప్పిస్తామని ఒప్పుకోవడంతో వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
