రామగుండం పోలీస్ కమీషనరేట్
మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి
మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీకించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్, మంచిర్యాల ఏసిపి ఆర్.ప్రకాష్, రూరల్ సీఐ అశోక్ కుమార్, సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
