✍️దుర్గా ప్రసాద్
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం.
కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు…
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ పట్టుకున్నారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ.22 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక అద్దెకారును కిరాయికి తీసుకొని కారులో ఒరిస్సా ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి కారులో 43 కిలోల గంజాయిని తీసుక వస్తు ఉండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కు
పట్టుబడ్డాడు.
సురేందర్ సింగ్ (23) రాజ్‌కోట్, రాజస్థాని స్వంత స్వగ్రామం. కాని చాల కాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్న సురేందర్ గత కొంత కాలంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడని విచారణలో వెల్లడయ్యింది.
భధ్రాచలం ఇసుక స్టాండ్ సమీపంలో ఎన్‌ఫొర్స్‌మెంట్ ఖమ్మం టీమ్ ఎస్సై శ్రీధర్‌రావు, హెడ్‌కానిస్టేబుళ్లు ఎంఏ ఖరీమ్, జి . బాలు, కానిస్టేబుళ్లు వెంకట్, సుధీర్, హరిష్, వీరబాబు, ఉపేందర్‌లు కలిసి పక్కా సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి …
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
