భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు, కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

సోమవారం జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో పిసా గ్రామసభ నిర్వహించారు. జగన్నాధపురం గ్రామంలోని A-1 లిక్కర్ షాపు కాల పరిమితి ఆగస్టులో ముగుస్తుండగా 2025-26 సంవత్సరమునకు తిరిగి లిక్కర్ షాప్ ఏర్పాటు చేయుటకు పిసాగ్రామసభ ఏర్పాటు చేసి ఈ నెల 31వ తేదీకి తిరిగి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎక్సైజ్ ఎస్సై శ్రీమతి సరిత, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి నారాయణ, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరావు, పెసా కమిటీ సభ్యులు బానోతు కుమార్, ధర్మ సోత్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ధర్మ సోత్ సేవియా, బాబురావు, వెంకటేష్, బిచ్చ, బానోతు బాలాజీ, చింటూ, తదితరులు పాల్గొన్నారు.