మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోమంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి సహకారంతో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు.

ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, జేరిపోతుల చంద్రకళ సేవకులు పోతరాజుల తిరుపతి, కాడపాక మహేందర్, బోనగిరి రజిత, మరియు దాతలు,తదితరులు పాల్గొన్నారు.