మంచిర్యాల జిల్లా,
లక్షెట్టి పేట్,
తేదీ: 22 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి, ప్రజలకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. వార్డులు, పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వర్షాకాలం అయినందున అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, భోజనశాల, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచి నాణ్యమైన పోషకాహారంతో కూడిన మెనూ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

వర్షాకాలం అయినందున విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పరీక్షలు చేసి వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థులతో మాట్లాడుతూ…

వారికి అందుతున్న సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పాఠ్యాంశాల బోధన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.