మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

బెల్లంపల్లి : శనివారం ఉదయం 8 గంటలకు అప్ లైన్ రైలు సోమగూడెం చర్చి వెనుక ట్రాక్ దాటుతుండగా, అదే అప్ లైన్ లో వస్తున్న రామగిరి మెమో ఎక్స్ ప్రెస్ రైలు, ప్రమాదవశాత్తు 65 నుండి 70 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఈ వ్యక్తి కి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను నల్ల చుక్కలు ఉన్న పసుపు రంగు ఫుల్ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్టు,బట్ట తల కలిగి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. అతని మృతదేహాన్ని బంధువుల సమాచారం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరుస్తామని తెలిపారు.

మరణించిన వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే,వారు 8712658601, 9948481902 మొబైల్ నంబర్లకు తెలియజేయాలని సూచించారు.