మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది:25 ఆగష్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్
బెల్లంపల్లి: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపారు. ర్యాగింగ్ మన సంస్కృతి కాదు,ఇలాంటి విష సంస్కృతికి ఎవరూ పాల్పడవద్దని విద్యార్థులకు సూచించారు.
తోటి విద్యార్థులతో స్నేహంగా మెలగాలని,చదువులో పోటీ పడాలే తప్ప వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అన్నారు.ర్యాగింగ్ చేయడం నేరం, ర్యాగింగ్ లాంటి అసాంఘిక చర్యకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు.
ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం యాక్ట్ 1997 నుండి అమల్లోకి వచ్చిందని, విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్ లాంటి వికృత చేష్టలకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న తరుణంలో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై సోమవారం బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు సూచనలు చేశారు.
విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడడమనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఇలాంటి చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు, ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని, దీని వల్ల ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థుల భవిష్యత్తుకు చెందిన విద్యా, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
అలాగే విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలని, నూతనంగా వచ్చిన విద్యార్థుల కొసం ప్రత్యేక పరివేక్షణ వుండాలని, ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని, విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకుగాను 24 గంటల హైల్ప్‌లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో వుంచాలని, విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని, ఎవరైన ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం లేదా పోలీసులకు సమచారం అందించాలని సూచించారు.
ర్యాగింగ్‌కు పాల్పడం ద్వారా విద్యా భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచిస్తూ, ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని, కావున విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విధ్యార్థులు పోలీసులు కలిసి పనిచేసిప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుతామని వారు తెలిపారు.
విద్యార్థినిలను ఎవరైనా అవహేళన చేసినా, అసభ్యంగా మాట్లాడినా, ర్యాగింగ్ చేసిన వెంటనే డయల్ 100,
హెడ్ కాన్స్టేబుల్ స్వప్న సెల్ నెంబర్ : 8712580662
షీ టీమ్ మంచిర్యాల,
ఎస్.ఐ హైమ సెల్ నెంబర్ : 8712581092, ఇన్స్పెక్టర్ బెల్లంపల్లి వన్ టౌన్ : 8712656559 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
