మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:8 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
నూతన సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మనోజ్ ను మర్యాద పూర్వకముగా కలసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్. అనంతరం బెల్లంపల్లిలో సింగరేణి, ప్రభుత్వ భూముల కబ్జాలపై, మెయిన్ బజార్ ఏరియాలో ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తూ,ఫుట్ పాత్ ల అక్రమణలపై వినతి పత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం పై ఉన్నత స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని, అధికారులు రోడ్డు విస్తరణ అంటూ, కాలయాపన చేస్తుండడంపై ఇది వరకు గత సంవత్సరం నవంబర్ 18 న ప్రజా దర్బార్ లో సైతం విజ్ఞప్తి చేయడమైనదని తెలిపారు.
రోడ్డు విస్తరణ విషయమై కొందరు దళారులు వ్యాపారాస్తులను భయ బ్రాంతులకు గురిచేస్తూ రోడ్డు విస్తరణ పనులు ఆపుతామని చెపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
