భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
సుజాతనగర్ మండలం
✍️దుర్గా ప్రసాద్
సుజాతనగర్ మండలంలో ఆదివారం రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
-సుజాతనగర్ గ్రామంలోని సింగభూపాలెం రోడ్డులో సీరపు సుగుణ యాదగిరి రెడ్డిల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ దుర్గా కన్వెన్షన్ హాల్*l గ్రాండ్ ఓపెనింగ్ లో కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
-సుజాతనగర్ లో యాట సుదర్శనం (లేటు) మనవరాలు యాట చందర్రావు కుమార్తెల పుష్పాలంకరణ వేడుకల్లో కొత్వాల పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.
*ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, లోశెట్టి నాగార్జున, కోరుబోయిన నాగేశ్వరరావు, కలవల నాగయ్య, గాజుల సీతారామయ్య, బైరు సాంబయ్య, చిమట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
