మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కలంబ్లో దారుణం చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి తన భార్య సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన గోవింద్ పవార్ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలు ఎందుకు చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.