సినీనటుడు, DMDK అధినేత విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

2 రోజుల్లో డిశ్చార్జి అవుతారని సమాచారం. విజయ్ కాంత్ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో పాలయ్యారు. చెన్నైలోని మియత్ హాస్పిటల్లో 20 రోజులు చికిత్స పొందారు.

ఇటీవలే ఆయన డిశ్చార్జి అయ్యి ప్రజల ముందుకు వచ్చారు. మరోసారి హాస్పిటల్ లో చేరడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.