APPCC చీఫ్ షర్మిల నిర్ణయం మేరకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకోని, ఫిబ్రవరి 2న ఉదయం AICC కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుపై జాతీయ స్థాయి నేతలకు వివరించాలని APCC నిర్ణయించింది. అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో మధ్యాహ్నం జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టనుంది.