భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు.

తొలుత ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు.

అనంతరం ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.