ఆవిష్కరణే అభివృద్ధికి పునాది అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టెక్నాలజీపై ఆధారపడే నేటి యువతకు ఇదో స్వర్ణ యుగం అని తెలిపారు.
రూ.లక్ష కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా లాంగ్ టర్మ్/రీఫైనాన్సింగ్ సదుపాయం కలుగుతుందన్నారు. తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేకుండానే సుదీర్ఘ గడువుకాలానికి రుణాలు అందిస్తామన్నారు. దీని ద్వారా ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.