దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కట్టడి లక్ష్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ 15-20%తో మూడో స్థానంలో ఉంది.

దీంతో ఏటా లక్ష మందికి పైగా చనిపోతున్నారు. 15-35 సం.లోపు మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.