జనవరి 24 నుంచి జరుగుతోన్న జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు నేటితో ముగియనున్నాయి.

మరో నాలుగు రోజుల్లో ప్రాథమిక కీని ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఫలితాలను (పర్సంటైల్ స్కోర్) వెల్లడించనుంది.

కాగా ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో నిన్న జరిగిన గణితం పేపర్ కఠినంగా ఉన్నట్లు జేఈఈ నిపుణులు చెబుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు సులభంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.