ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: నవమి ప.01:10 వరకు
తదుపరి దశమి
వారం: ఆదివారం – భానువాసరే
నక్షత్రం: అనురాధ రా.తె.04:04 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వృధ్ధి ఉ.11:43 వరకు
తదుపరి ధృవ
కరణం: గరజ ప.01:10 వరకు
తదుపరి వణిజ రా.01:05 వరకు
తదుపరి భధ్ర
వర్జ్యం: ఉ.07:31 – 09:10 వరకు
దుర్ముహూర్తం: సా.04:41 – 05:27
రాహు కాలం: సా.04:46 – 06:12
గుళిక కాలం: ప.03:21 – 04:46
యమ గండం: ప.12:29 – 01:55
అభిజిత్: 12:07 – 12:51
సూర్యోదయం: 06:47
సూర్యాస్తమయం: 06:12
చంద్రోదయం: రా.01:15
చంద్రాస్తమయం: ప.12:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: పశ్చిమం
భీష్మ జయన్తీ
త్రైలోక్య గౌరీ వ్రతం
తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవ స్వామి ఉత్సవారంభం
పండిత్ భీమ్‌సేన్‌జోషి జన్మదినం
సత్యేంధ్రనాథ్ బోస్ స్మృతి దినం
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అష్టమ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
వృషభం
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మిధునం
కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. ఒక నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
కర్కాటకం
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి, ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
సింహం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీరామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఆపదలు తొలగడంతో పాటు శుభప్రదం.
కన్య
ఆశించిన ఫలితాలు ఉంటాయి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృశ్చికం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
ధనుస్సు
శ్రమతో కూడిన ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.
మకరం
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు సదా రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
కుంభం
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఉన్నతాధికాధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం
మీనం
ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలసలహాలు తప్పనిసరి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)