గజ్వేల్ మండల ప్రజా పరిషత్ స్కూల్లో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు….

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గజ్వేల్ ఏసిపి రమేష్ అన్నారు.

మంగళవారం గజ్వేల్ లో మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు.

అతిథిగా గజ్వేల్ ఏసిపి రమేష్ హాజరయ్యారు. అనంతరం వారు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ… అన్ని వసతులున్న గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు చేర్పించాలని వారన్నారు.

ప్రైవేటు స్కూలుకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నదని వారన్నారు. తల్లిదండ్రులు గుర్తించ వలసింది ఇంత చిన్న పిల్లని చదువు చెప్పడానికి గైడ్ చేసుకుంటుంది అంటే మీ తల్లి దండ్రులకు అదృష్టం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ వ్యవసాయం చేసేవాళ్లే కాబట్టి మీరు మీ పిల్లలను ఎంకరేజ్ చేయాలి.

మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి జైన్ చేయించాలి. జయాపజయాలకు కృంగి పోకుండా, విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని వారన్నారు. విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు చదువు పై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,vవిద్యార్థులు సోషల్ మీడియాల కు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారన్నారు, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్ యశస్విని ప్రొజెక్టర్స్ విద్యార్థులకు అందజేశారు, లయన్స్ క్లబ్ పరమేశ్వర స్పోర్ట్స్ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు. స్కూల్ ఉపాధ్యాయులు పాపారావు, శారద, కౌన్సిలర్ బొగ్గుల చందు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.