హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం సమీపంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భట్టి విక్రమార్క కామెంట్స్

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ ను ఇందిరమ్మ రాజ్యంలో కంటికి రెప్పలా కాపాడుకుంటాం

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుంటుంది

ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల మానవీయంగా వ్యవహరిస్తుంది

కార్మిక హక్కులు కాపాడే విధంగా ప్రజా పాలన అందిస్తాం

తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికి ఉండేలా కేంద్రంతో మాట్లాడుతున్నాం

బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసింది

సింగరేణి సంస్థలో 1.05 లక్షల ఉద్యోగాలను గత పాలకులు 42 వేలకు కుదించారు. ఈ ఎన్నికల్లో తిరిగి వాళ్లే గెలిచి ఉంటే ఐదు వేల కు కుదించేవారేమో!

గత పాలనలో కార్మికులకు ద్రోహం చేసిన ప్రభుత్వాన్ని మార్చుకొని స్వేచ్ఛ, ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమని మీ ఉద్యోగాల కోసం మీరు కాంగ్రెస్ ను గెలిపించినందుకు కృతజ్ఞతలు

సింగరేణి కాలరీస్ సంస్థను గత ప్రభుత్వం తమ రాజకీయాలకు, స్వలాభం కోసం వాడుకున్నారు

పది సంవత్సరాలు పరిపాలించి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా ప్రభుత్వం రాగానే పారదర్శకంగా నియామకాలు చేస్తామని చెప్పాం. అందులో భాగమే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా సింగరేణి సంస్థలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఈరోజు అందిస్తున్నాం.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న యువతీ యువకుల ఆశలు నిజం చేస్తాం

ఎల్బీ స్టేడియంలో ఒకే రోజు 7 వేల మంది నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టాం

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇందిరమ్మ పరిపాలనలో నియామక ప్రక్రియ మొదలైంది

సింగరేణి సంస్థలోని ప్రతి వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది

నియామక పత్రాలు తీసుకున్న ఉద్యోగులందరినీ రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది.

స్వేచ్ఛ స్వతంత్రం భేషా జాలలు లేకుండా ప్రతి సమస్యపై సింగరేణి కార్మికులు గళమెత్తెవారు

సింగరేణి కార్మికులు భావ స్వేచ్ఛను హరించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తిరిగి సంపూర్ణ స్వేచ్ఛను అందిస్తున్నాం.

సింగరేణి ఉద్యోగాలకు గాని స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థను ఈ ప్రభుత్వం కాపాడుతుంది

సహజ వనరులు అందించి రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం కావాలి.

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై గత రెండు నెలలుగా వక్ర భాష్యాలు మాట్లాడుతున్న వారి నుంచి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.