పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్
తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
తేది 10-02-2024 నాడు ఉదయం 0800 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో ఉన్నదని మరియు పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. మరియు పోలీస్ అధికారులు ఇబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ,ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలు
- సెంట్ మేరీస్ విద్యానికేతన్ ప్రజ్ఞాపూర్
- సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గజ్వేల్
- తెలంగాణ మోడల్ స్కూల్ సంగాపూర్ రోడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్
- జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్
- గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్
- జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రజ్ఞాపూర్
- జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్