కొండపాక, 10 ఫిబ్రవరి,2024

మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి.

అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి గ్రామంలో చిట్యాల రాములు,రవీంద్ర నగర్ విశ్వనాధ్ పల్లి గ్రామంలో గొడుగు దేవవ్వ కు ఈ ముగ్గురికి ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ “చిట్టి దేవేందర్ రెడ్డి,మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి , గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.