రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా, వాహనదారులకు, ప్రజలకు, వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు

ఈ సందర్భంగా సిఐ సైదా, మాట్లాడుతూ…

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరం.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్, సీటు బెల్టు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టుధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు.

పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.