నారాయణరావుపేట

మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు నక్క కాంతయ్య, అధ్యక్షులు బోయిని బాలయ్య, కార్యనిర్వహ అధ్యక్షుడు సారుగు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాట్ల రాజు, ప్రధాన కార్యదర్శి మోసర్ల భూపతి రెడ్డి, కార్యదర్శులుగా జక్కుల బుచ్చెయ్య, దాకం కనకయ్య గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకుని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

అదే విదంగా జక్కాపూర్ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా, ఐక్యమత్యంగా ఉందని, అదే ఐక్యమత్యంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి, అందరికి అందుబాటులో ఉండాలన్నారు.ఇంకా అనేక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వ పెద్దల దృష్జికి ఎప్పటికప్పుడు తీసుకపోయి, పరిష్కారం చేసుకునెందుకు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షలు రాజేశం గౌడ్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, చిన్నకోడూర్ సీనియర్ నాయకులు కనకయ్య, తీగల భాస్కర్, పల్లె పర్శరాములు, నిరుగొండ దేవయ్య,కయ్యాల అంజయ్య, గుండెల్లి వేణు, పల్లె ప్రశాంత్, జక్కుల కనకయ్యా, ఎండి షాదుల్, రఫి, పనుగట్ల రామచంద్రము తదితరులు పాల్గొన్నారు.