ఉద్యోగుల చాట్స్ పై ఏఐ ద్వారా పలు కంపెనీలు నిఘా పెడుతున్నట్లు సమాచారం. వాల్మార్ట్, డెల్టా, టీ-మొబైల్, నెస్లే, ఆస్ట్రాజెనెకా, స్టార్బక్స్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

‘అవేర్’ సంస్థ క్రియేట్ చేసిన ఈ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్ వంటి అప్లికేషన్లపై నిఘా పెడుతోందట. 30లక్షల మందికిపైగా ఉద్యోగులకు చెందిన 20 బిలియన్ మెసేజ్లను విశ్లేషించినట్లు అవేర్ సంస్థ వెల్లడించింది.