మేడారం మహా జాతర హుండీల లెక్కింపు 6 రోజుల్లో పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

మహా జాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీలను లెక్కించగా.. రూ.12.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 779.800గ్రా, 55 కిలోల 150 గ్రా. వెండి రూపంలో భక్తులు మొక్కలు చెల్లించినట్లు చెప్పారు. గతేడాది కంటే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.