కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామం ఉంది. అక్కడుండే కొండదొర తెగ ఆదివాసీలకు సీఎం ఎవరో కూడా తెలియదట. ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పారు.
ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి ఓటు హక్కు వచ్చింది. వీరంతా తాము ఇంతవరకు ఓటు వేయలేదని చెబుతున్నారు. వీరిలో చాలా మందికి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు. కనీసం ఆధార్ కార్డు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.