టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి.

డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి బయటకు రాలేక ఆమె చనిపోయారు. గేర్ షిఫ్టింగ్ డిజైన్ లో లోపాలే ఈ ఘటనకు కారణమని పలువురు టెస్లా యూజర్లు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఈ డిజైన్ పై ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.