అయోధ్యలో రామమందిరంలా బిహార్ లో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. సీతాదేవి జన్మస్థలంగా భావించే సీతామడీ జిల్లాలో ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి విరాళాలు సేకరించనుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో సీతమ్మ కోసం కొత్త ఆలయ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు.