ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: చతుర్దశి ఉ.09:53 వరకు
తదుపరి పూర్ణిమ
వారం: ఆదివారం – భానువాసరే
నక్షత్రం: పూర్వఫల్గుణి ఉ.07:40 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: గండ ఉ.08:32 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: వణిజ ఉ.09:53 వరకు
తదుపరి భధ్ర రా.10:52 వరకు
తదుపరి బవ
వర్జ్యం: ప.03:39 – 05:25 వరకు
దుర్ముహూర్తం: సా.04:50 – 05:39
రాహు కాలం: సా.04:56 – 06:28
గుళిక కాలం: ప.03:25 – 04:56
యమ గండం: ప.12:22 – 01:53
అభిజిత్: 11:58 – 12:46
సూర్యోదయం: 06:16
సూర్యాస్తమయం: 06:27
చంద్రోదయం: సా.05:50
చంద్రాస్తమయం: రా.తె.05:42
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
దిశ శూల: పశ్చిమం
హుతాశన పూర్ణిమ
హోళికా దహనం
మహేశ్వర వ్రతం
లలితాకాంతాఖ్యాదేవి
వ్రతం
బప్పనాడు దుర్గాపరమేశ్వరి
ధ్వజారోహణం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి
తెప్పోత్సవ సమాప్తి
బ్రహ్మసావర్ణి మన్వాది
చెన్నై శ్రీ మల్లీశ్వర రథోత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. శ్రీవెంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.
వృషభం
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.
మిధునం
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.
కర్కాటకం
ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసర కలహం సూచితం. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
సింహం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
కన్య
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
తుల
బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.
వృశ్చికం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.
ధనుస్సు
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్రదోషం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
మకరం
కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
కుంభం
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది.
మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)