localnewsvibe

ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఏటా భారీగా పెరుగుతుండటంపై UN ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 62 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అయిందని.. ఇది 6వేల ఐఫిల్ టవర్స్తో సమానమని పేర్కొంది.

ఏటా ఈ-వేస్ట్ 2.6 మిలియన్ టన్నుల చొప్పున పెరుగుతోందని 2030 నాటికి ఆ మొత్తం 82 మిలియన్ టన్నులకు చేరుతుందని హెచ్చరించింది. ఈ వ్యర్థాలు ఎక్కువగా ఈ-సిగరెట్స్, గృహోపకరణాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది.