నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు.

1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా వీలైనంత ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున సెలెక్ట్ చేసినట్లు బోర్డు తెలిపింది. జులై 28న మెయిన్స్ జరగనుంది.