కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతూ ప్రకటించిన గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.