వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతోపాటు.. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా రోడ్లపై ఉండాలన్నారు. సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకం చేపట్టాలన్నారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇవ్వాలని చెప్పారు.