కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు.

ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం కార్యాలయానికి వచ్చిన ఓ 17ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని మార్చి 14న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.