ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: ద్వాదశి పూర్తి

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: స్వాతి ప‌.03:01 వరకు
తదుపరి విశాఖ

యోగం: శివ రా.09:37 వరకు
తదుపరి సిద్ధ

కరణం: బవ‌ సా.05:22 వరకు
తదుపరి బాలవ పూర్తి

వర్జ్యం: రా.09:01 – 10:44 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:20 – 09:13
మరియు రా‌.11:09 – 11:53

రాహు కాలం: ప‌.03:34 – 05:14

గుళిక కాలం: ప‌.12:17 – 01:56

యమ గండం: ఉ‌.08:59 – 10:38

అభిజిత్: 11:51 – 12:43

సూర్యోదయం: 05:42

సూర్యాస్తమయం: 06:52

చంద్రోదయం: ప‌.03:34

చంద్రాస్తమయం: రా.02:25

సూర్య సంచార రాశి: మిథునం

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: ఉత్తరం

అతిరిక్తై నిర్జల‌ ఏకాదశి
( మతాంతరం )

రామలక్ష్మణ ద్వాదశి

కూర్మ జయంతి

చంపక ద్వాదశి

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
స్వాతితారా యోగము

కంచి జగద్గురు శ్రీ
సురేశ్వరాచార్య‌ పుణ్యతిథి‌

అహోరాత్ర‌ త్రివిక్రమ పూజ

కంచి జగద్గురు శ్రీ బ్రహ్మానందఘనైంద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌

సహిరణ్యశర్కోదక‌
కుంభదానము‌

ఛత్రపతి సంభాజీ మహారాజ్
జయన్తీ

కాశీ విశ్వనాథ కలశ యాత్ర

శ్రీమజ్జగద్గురు విద్యాభినవ
విద్యారణ్య భారతీ స్వామి
పీఠారోహణ దినోత్సవం

చోళవంతన్‌ శ్రీ జానకీ
మరియమ్మన్‌ ఉత్సవం

శ్రీ వేదం‌ వేంకటరాయ‌ శాస్త్రి స్మృతి దినం

పాలకోడేటి శ్యామలాంబ స్మృతి దినం


నేటి రాశి ఫలాలు


మేషం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు, మిత్రుల ఆదరణ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృషభం

శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

మిధునం

చేసే పనిలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ వల్ల అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం

శారీరకశ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.

సింహం

మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది.

కన్య

ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపుకొనిపోవడం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

తుల

మనఃస్సౌఖ్యం కలదు. మీ బుద్ధిబలంతో పూర్తి చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచిపేరు వస్తుంది. కులదైవ సందర్శనం శ్రేయస్కరం.

వృశ్చికం

ముఖ్య వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు

ఇష్టసిద్ధి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలత ఉంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

మకరం

ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శివస్తోత్రం చదవడం మంచిది.

కుంభం

ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం

మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం చదవాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)