రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చొరవలో భాగంగా ముందుగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లోని 60 రేషన్ షాపులను జన్ ఫోషణ్ కేంద్రాలుగా మార్చనున్నారు.